వేలం పాటలో రూ.1.26 కోట్లు పలికిన లడ్డూ.. ఎక్కడో తెలుసా..?

ఇప్పటివరకూ హైదరాబాద్‌లో లడ్డూ వేలం పాట అంటే బాలాపూర్ మాత్రమే గుర్తుకు వచ్చేది. తాజాగా ఆ రికార్డును రిచ్‌మండ్‌ విల్లా తిరగరాసింది.

Advertisement
Update:2023-09-28 11:12 IST

నవరాత్రులు పూజలందుకున్న గణనాథుడి చేతిలోని లడ్డూ.. వేలంలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటివరకూ హైదరాబాద్‌లో లడ్డూ వేలం పాట అంటే బాలాపూర్ మాత్రమే గుర్తుకు వచ్చేది. తాజాగా ఆ రికార్డును రిచ్‌మండ్‌ విల్లా తిరగరాసింది. కోటి రూపాయలకు పైగా ధర పలికి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది.

రాజేంద్రనగర్‌లోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాలోని గణనాథుడి లడ్డూ రూ. 1.26 కోట్లు పలికింది. ఇక మై హోం భుజాలోని గణేశుని లడ్డూ రూ. 25 లక్షల 50 వేలకు చిరంజీవి గౌడ్‌ అనే వ్యక్తి దక్కించుకున్నారు. గతేడాది కంటే రూ. 7 లక్షలు అధికంగా ధర పలికింది.

బాలాపూర్‌ గణేశుడి లడ్డూ ఇవాళే వేలం వేయనున్నారు. ఈ సారి పాతిక లక్షలు దాటుతుందని ఉత్సవ కమిటీ సభ్యులు అంచనా వేస్తున్నారు. గతేడాది వంగేటి లక్ష్మారెడ్డి రూ.24.60 లక్షలకు వినాయకుడి లడ్డూను దక్కించుకున్నారు.


Tags:    
Advertisement

Similar News