హై సెక్యూరిటీ ప్రాంతంలో అత్యాచారం జరగడం దారుణం : హరీశ్‌రావు

హై సెక్యూరిటీ ప్రాంతంగా చెప్పుకునే గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిపై అత్యాచారం జరగడం దారుణమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు

Advertisement
Update:2024-10-15 20:42 IST

హై సెక్యూరిటీ ప్లేస్ గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిపై అత్యాచారం జరగడం ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్ ద్వారా తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యం అయ్యాయని, నేరాల రేటు గణనీయంగా పెరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నా సీఎం రేవంత్‌రెడ్డికి కనీస పట్టింపు లేదన్నారు.హోంమంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి ఒక్క నాడు సమీక్ష చేయడం లేదన్నారు.

మహిళా భద్రతకు చిరునామాగా ఉన్న తెలంగాణలో ఇలాంటి ఘటనలు వరుసగా జరగడం బాధకరమన్నారు. అత్యాచార బాధితురాలికి భరోసా కల్పించాలని, నిందితులను గుర్తించి కఠిన శిక్ష పడేలా చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మహిళా భద్రత పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తున్నట్లు తెలంగాణ సీఎంఓ, డీజీపీని ఎక్స్‌లో ట్యాగ్ చేశారు. బాధితురాలికి భరోసా కల్పించి, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags:    
Advertisement

Similar News