మునుగోడు ప్రజలారా పారిపోండి.. పాల్ బాంబు వేస్తున్నాడు. ఆర్జీవీ ఫన్నీ ట్వీట్ వైరల్

మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి చెందిన నేపథ్యంలో కేఏ పాల్ ISIS, ALQAEDA లోని తమ స్నేహితులను మునుగోడు నియోజకవర్గంలో బాంబులు వేయడానికి ఉపయోగించనున్నట్లు ఇప్పుడే విన్నానని.. మునుగోడు ప్రజలారా..దయచేసి పరుగు పెట్టాలని వర్మ ట్వీట్ చేశాడు.

Advertisement
Update:2022-11-06 18:29 IST

మునుగోడు ఉప ఎన్నిక తతంగం ముగిసింది. ఉత్కంఠ పరిస్థితుల్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించాడు. మునుగోడు ఉప ఎన్నిక ఎంత సీరియస్‌గా సాగినా మధ్య మధ్యలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రజలను తన కామెడీతో నవ్వించాడు. ప్రచారాన్ని పాల్ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఏమాత్రం తీసిపోకుండా చేపట్టాడు. ఫక్తు రాజకీయ నాయకుడిగా మారి దోశలు వేశాడు. యాదవుడి గెటప్‌తో గోవులు కాశాడు. ఫలితాల వెల్లడి రోజు కూడా ఈవీఎంలు మార్చి నన్ను ఓడించారని పాల్ చేసిన వ్యాఖ్యలు నవ్వులు పండించాయి.

ఇదిలా ఉండగా కేఏ పాల్‌ను ఉద్దేశించి ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన వరుస ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి చెందిన నేపథ్యంలో కేఏ పాల్ ISIS, ALQAEDA లోని తమ స్నేహితులను మునుగోడు నియోజకవర్గంలో బాంబులు వేయడానికి ఉపయోగించనున్నట్లు ఇప్పుడే విన్నానని.. మునుగోడు ప్రజలారా..దయచేసి పరుగు పెట్టాలని వర్మ ట్వీట్ చేశాడు.


మునుగోడులో ఎటువంటి పంటలు పండకుండా చూడటానికి, ప్రజలందరికీ ప్రాణాంతక వైరస్ సోకేలా పాల్ ఏసు ద్వారా తన శక్తిని ఉపయోగిస్తున్నట్లు కూడా విన్నానని మరో ట్వీట్ చేశాడు వర్మ. ' కేఏ పాల్ ఇప్పుడు మునుగోడు నుండి తరిమివేయబడ్డాడు. 2024లో కేఏ పాల్ అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయడం మంచిది. అక్కడ గెలిచిన తర్వాత అతడు మునుగోడు నియోజకవర్గంలో అణుబాంబు విసరవచ్చు.' అని వర్మ చివరగా చేసిన ఫన్నీ ట్వీట్ సోషల్ మీడియాలో మరింత వైరల్ అయ్యింది. వర్మ చేసిన వరుస ట్వీట్లకు నెటిజన్లు కూడా ఫన్నీగా స్పందిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News