సీఎం రేవంత్‌రెడ్డిపై రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు

దేశ భద్రత విషయంలో రాజకీయాలు చేయడం సరికాదు అన్నారు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్. వికారాబాద్ జిల్లా దామగుండం వద్ద రాడార్ కేంద్రానికి ఆయన శంకు స్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

Advertisement
Update:2024-10-15 15:30 IST

దేశ భద్రత విషయంలో రాజకీయాలు చేయడం కరెక్టు కాదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. వికారాబాద్ జిల్లా దామగుండం వద్ద రాడార్ కేంద్రానికి ఆయన శంకు స్థాపన చేశారు. రాజకీయ పార్టీలు వేరైనప్పటికీ దేశాభివృద్ధికి కోసం అందరు కలిసి పని చేయాలని కేంద్ర మంత్రి అన్నారు. ముఖ్యంగా రాడార్ కేంద్రం ఏర్పాటుకు సహకరించిన తెలంగాణ సర్కార్‌కి ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి చేసిన కృషి ప్రసంశనీయం అన్నారు. రక్షణ రంగ పరికరాల తయారీలో హైదరాబాద్‌కి మంచి పేరు ఉంది అన్నారు. దేశ భద్రతలో రాడార్ స్టేషన్ కీలకం అన్నారు. కమ్యూనికేషన్ రంగంలో టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారుతోంది అన్నారు. రాజకీయాలు వేరు.. దేశ భద్రత వేరు అన్నారు. తపాలా వ్యవస్థను అనేక ఏళ్లుగా వినియోగించుకున్నాం.ప్రస్తుతం ఇంట్లో కూర్చునే అనేక కోర్సులు నేర్చుకునే అవకాశం వచ్చిందని తెలిపారు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్.

Rajnath Singh praises CM Revanth Reddy.. contributed to Radarమాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి రోజున ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. నేవీలో వాడే అన్ని రకల ఆయుధాలను తయారు చేసే నగరంగా హైదరాబాద్‌కు గొప్ప అవకాశం వచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రక్షణ రంగానికి చెందిన అనేక సంస్థలు భాగ్యనరంలో ఉన్నాయన్నారు. దేశానికి మూడు వైపులా సముద్రం ఉందని, వాటిలో ప్రయాణించే షిప్ లు, వ్యవస్థలను మానిటరింగ్ చేసే వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ ను వికారాబాద్ లో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ అంశాన్ని చాలారకాలుగా చాలా మంది వివాదాస్పదం చేసేందుకు ప్రయత్నించారని, ఈ రాడార్ స్టేషన్ తో ప్రజలకు లేనిపోని అపోహల్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తమిళనాడులో వీఎల్ఎఫ్ ను 1990లో ప్రారంభించారని, అక్కడి ప్రజలకు ఎలాంటి కష్టం, నష్టం జరగలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.పార్టీలకు అతీతంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దామగుండం నేవీ రాడార్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్రమంత్రులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News