రాజ్యసభ సభ్యత్వానికి ఆర్. కృష్ణయ్య రాజీనామా..త్వరలో కమలం గూటికి ?
రాజ్యసభ సభ్యత్వానికి ఆర్. కృష్ణయ్య రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనఖడ్‌కు అందజేశారు. ఛైర్మన్ వెంటనే ఆమోదించారు.
రాజ్యసభ సభ్యత్వానికి ఆర్. కృష్ణయ్య రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనఖడ్‌కు అందజేశారు. ఛైర్మన్ వెంటనే ఆమోదించారు. తెలంగాణకు చెందిన కృష్ణయ్యను వైసీపీ అధినేత జగన్ ఏపీ నుంచి రాజ్యసభకు పంపారు. బీజేపీలో చేరుతారని ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం ఈ ప్రచారానికి బలాన్ని ఇచ్చినట్టైంది.
బీజేపీ వర్గాలు కూడా ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ధ్రువీకరించే అవకాశం ఉంది. తెలంగాణలో బీసీ ఓటు బ్యాంకును పెంచుకోవాలని కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత కృష్ణయ్యను పార్టీలోకి చేర్చుకుంటే బీసీలు బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని వారి బీజేపీ ప్లాన్. ఈ మేరకు ఆర్. కృష్ణయ్యతో పార్టీ జాతీయ అగ్రనేత ఒకరు నేరుగా చర్చలు జరిపినట్లు టాక్. కృష్ణయ్యను ప్రధాని మోదీ బీసీ కమీషన్ ఛైర్మన్‌గా ప్రకటించే చాన్స్ ఉంది. దీనికి సంబంధించి చర్చలు జరిగినట్లు తెలుస్తోంది