కోటి దీపోత్సవంలో పాల్గోన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం కార్యక్రమానికి విశిష్ట అతిధిగా హాజరయ్యారు.
హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గోన్నారు. కోటి దీపోత్సవంలో దీప ప్రజ్వలన చేసిన రాష్ట్రపతి ముర్ము తొలి కార్తీక దీపాన్ని వెలిగించారు. పూరీ జగన్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. కోటి దీపోత్సవంలో రాష్ట్రపతి వెంట కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రి సీతక్కలు కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా భక్తులనుద్ధేశించి రాష్ట్రపతి ముర్ము మాట్లాడారు. పూరి జగన్నాథుడి కళ్యాణంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగు నేలపై కార్తీక మాసం వేళ కోటి దీపోత్సవం వేడుకలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. కార్తీక మాసంలో అందరూ శివుడిని కొలుస్తారు. అసత్యం పై సత్యం గెలిచిన పండుగ ఇది అన్నారు. అందరూ ఒక్కటై దీపాన్ని వెలిగించడం ఏకత్వాన్ని సూచిస్తుందన్నారు. అనంతరం కోటీ దీపోత్సవంలో జాతీయ గీతం ఆలపించారు.