చాక్లెట్ల రూపంలో గంజాయి విక్రయం.. - నిందితులు అరెస్ట్
ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు..? ఈ చాక్లెట్లను ఎక్కడ తయారు చేస్తున్నారు..? ఎలా సరఫరా చేస్తున్నారు..? వీటిలో గంజాయిని ఎంత మోతాదులో చొప్పిస్తున్నారు..? తదితర వివరాలను తెలుసుకునే దిశగా పోలీసులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
గంజాయి విక్రయాలకు కొత్త మార్గం కనిపెట్టారు అక్రమార్కులు. వీటితో ప్రజలంతా.. ముఖ్యంగా పిల్లలు అత్యంత ఇష్టంగా తినే చాక్లెట్ల రూపంలో వీటిని మార్కెట్లో విక్రయానికి పెట్టిన ఈ ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు శుక్రవారం రట్టు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్‌లోని పటాన్ చెరులో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు దాడి చేసి ఆ ముఠాను అరెస్ట్ చేశారు. అరెస్టయినవారిలో ఒడిశాకు చెందిన అనిమేష్, రంజిత, బాజ్ర మోహన్ ఉన్నారు. వీరు గంజాయి చాక్లెట్లు తయారుచేసి.. వాటిని ఆకర్షణీయమైన వ్యాపర్లలో పెట్టి ఒక్కొక్కటి రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. చార్మినార్ గోల్డ్ మునాఖ్చా పేరుతో ఈ చాక్లెట్లను విక్రయిస్తున్నారు. ప్రస్తుతం వారికి బాగా పరిచయస్తులకు మాత్రమే వీరు ఈ చాక్లెట్లు అమ్ముతున్నట్టు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ముగ్గురికి చెందిన షాపులపై దాడి చేసి వారి నుంచి 271 చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.