కేసీఆర్ ప్రభుత్వ చిత్తశుద్ధికి పాలమూరు ప్రాజెక్టే సాక్ష్యం : మంత్రి కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం.. కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి సాక్ష్యమని మంత్రి కేటీఆర్ అన్నారు.

Advertisement
Update:2023-09-04 11:57 IST

పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు దక్షిణ తెలంగాణ ప్రజల ఎన్నో దశాబ్దాల కల. ఇప్పుడు ఆ కల సాకారం అవుతోంది. ఆదివారం ప్రాజెక్టు డ్రై రన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. త్వరలోనే వెట్ రన్ కూడా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం.. కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి సాక్ష్యమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఒక పోస్టు పెట్టారు.

'ఆవిష్కృతం అవుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం!

సగర్వంగా ఎగురుతున్నది తెలంగాణ జలవిజయ పతాకం!

నీటికోసం తండ్లాడిన నేలల్లో సుజల దృశ్యం సాక్షాత్కారం.

ఇది తెలంగాణ సాగునీటిరంగంలో మరో కాళేశ్వరం.

అవాంతరాలను, అడ్డంకులను అధిగమిస్తూ...

కుట్రలను, కేసులను గెలుస్తూ..

జల సంకల్పంతో అనుమతులు సాధించి

దశాబ్దాల కలను సాకారం చేస్తూ

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి అవుతున్నది...

బిరబిరా కృష్ణమ్మ బీళ్లకు నీళ్ళందించనున్నది

ఇది తెలంగాణ జలశక్తి.

ఇది కేసీఆర్ ప్రభుత్వ చిత్తశుద్ధి' అంటూ ఆ పోస్టులో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

ఎన్నో అవాంతరాలను అడ్డంకులను అధిగమిస్తూ.. కుట్రలను ఛేదిస్తూ.. కేసులను గెలుస్తూ తెలంగాణ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసింది. స్వయంగా తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకులే పాలమూరుకు వ్యతిరేకంగా కేసులు వేయడం గమనార్హం. మరో వైపు పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని స్వయంగా చెప్పిన మోడీ.. ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంపై ఉన్న వివక్షకు తార్కాణం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. చివరకు కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేసింది. దీంతో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో.. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వాసులు ఆనందంలో మునిగిపోయారు.

Tags:    
Advertisement

Similar News