'పాలమూరు' ఎత్తిపోతలకు జైపాల్ రెడ్డి పేరు
సింగూరు ప్రాజెక్టుకు రాజనర్సింహ పేరు.. తెలంగాణ కేబినెట్ సమావేశంలో నిర్ణయం
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని తెలంగాణ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం సాయంత్రం సెక్రటేరియట్ లో ప్రారంభమైన కేబినెట్ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సింగూరు ప్రాజెక్టుకు మంత్రి దామోదర తండ్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాజనర్సింహ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు రెండో ప్యాకేజీ రివైజ్డ్ ఎస్టిమేట్ రూ.1,784 కోట్లకు ఆమోదం తెలిపారు. ఏదల రిజర్వాయర్ నుంచి డిండి లిఫ్ట్ స్కీంకు లింక్ చేసే పనులకు రూ.1,800 కోట్లతో ఆమోదముద్ర వేశారు. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్ శాఖలో 558 డిపెండెంట్ జాబ్స్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. రైతుభరోసా అమలుపై కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించనున్నారు.