అరెస్టులకు భయపడం.. ప్రజా గొంతుకగా ఉంటాం

లగచర్ల ఘటనను బీఆర్‌ఎస్‌కు అంటగట్టే ప్రయత్నంపై మండిపడిన మాజీ మంత్రి

Advertisement
Update:2024-11-13 12:15 IST

లగచర్ల ఘటనను బీఆర్‌ఎస్‌కు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ని పోలీసులు అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో సబత ఫిల్మ్‌నగర్‌లోని ఆయన ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వికారాబాద్‌ జిల్లా లగచర్లలో జిల్లా కలెక్టర్‌, అధికారులపై జరిగిన దాడి బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడి బీఆర్‌ఎస్‌ చేయించిందని అంటగట్టే ప్రయత్నం జరుగుతున్నది. నరేందర్‌రెడ్డిని అరెస్ట్‌ చేస్తే మా పార్టీ సైలెంట్‌ అవుతుందని అనుకుంటున్నారు. అరెస్టులకు భయపడం.. ప్రజా గొంతుకగా ఉంటాం. ఫార్మాసిటీపై ప్రభుత్వానికే స్పష్టత లేదన్నారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని సబిత అన్నారు.పట్నం నరేందర్‌రెడ్డి సతీమణి శృతి మాట్లాడుతూ.. ఉదయం 7 గంటలకు కేబీఆర్‌ పార్కులో వాకింగ్‌కు వెళ్లామని.. పోలీసులు అక్కడే ఆయనను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News