మా తల్లి, చెల్లి ఫొటోలు పెట్టి రాజకీయం చేస్తున్నారు : వైఎస్ జగన్
నా తల్లి, చెల్లి ఫోటోలు పెట్టి రాజకీయం చేస్తున్నారని.. ఎన్నికల హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైఎస్ జగన్ కూటమి సర్కార్‌పై మండిపడ్డారు.
ఆస్తి పంపకాలపై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా తల్లి, చెల్లి ఫోటోలు పెట్టి రాజకీయం చేస్తున్నారని సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. ఇవాళ విజయనగరం జిల్లా గుర్లలో డయేరియాతో మృతి చెందిన వారి కుటుంబాలను జగన్ పరామర్శించారు. మా ఫ్యామీలి వ్యవహారాలను రాజకీయం చేస్తారా? ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉండేవే అని ఆయన తెలిపారు. ప్రభుత్వం వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకే తిరుమల లడ్డూ ప్రసాదం ఇష్యూ అంశం తెరపైకి తెచ్చారు. టీడీపీ అక్రమాలు, అన్యాయాలు బయటపెడుతున్నామని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని జగన్ అన్నారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టండి.
ప్రజల కష్టాల్లో పాలు పంచుకోండి. రాష్ట్రంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి వాటిని అరికట్టేందుకు దృష్టిసారించండి అని హితవు జగన్ పలికారు. ఇదే సమయంలో విజయనగరంలో డయేరియాతో చనిపోయిన కుటుంబానికి రెండు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నట్టు వైఎస్ జగన్ ప్రకటించారు. డయేరియాతో ప్రాణాలు పోతున్నా కూటమి సర్కార్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. బాధితులకు ప్రభుత్వం సాయం అందిస్తుందా? లేదా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీనే ఇంత సాయం చేస్తుంటే.. బాధితులను పరామర్శిస్తుంటే.. ప్రభుత్వం నిద్ర మత్తులో ఉందా? అని మండిపడ్డారు.