నేను పార్టీ మారను.. ఎంపీ కోమటిరెడ్డి క్లారిటీ

వెంకట్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కొంతమంది కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

Advertisement
Update:2022-08-04 18:07 IST

పార్టీ మార్పు వ్యవహారంపై ఎంపీ కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారబోనని స్పష్టం చేశారు. ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేయడం.. బీజేపీలో చేరబోతున్నానని ప్రకటించడంతో కోమటిరెడ్డి కూడా పార్టీ మారబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా తమకు టచ్ లోనే ఉన్నారని ప్రకటించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. దీంతో వెంకట్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కొంతమంది కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

తన తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం త‌న‌కు సంబంధం లేదని, పార్టీకి విధేయుడిగా, పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేస్తానన్నారు. తాను టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్‌ అని, తానెందుకు పార్టీ మారతానని, మారాల్సిన అవసరం లేదన్నారు. అయితే, తమ ఫ్యామిలీపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని మరోసారి పేర్కొన్నారు.

తాను ప్రాతినిధ్యం వహించే భువనగిరి పార్లమెంట్​ నియోజకవర్గ అభివృద్ధి కోసం కేంద్ర మంత్రులను కలవడం తప్పు కాదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ​వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 25 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా పని చేశానని, తాను పార్టీ మారుతానని వస్తున్న వార్తల్లో నిజం లేదని, పార్టీ మారుతున్నట్లు చెప్పే వారికి లీగల్ నోటీసులు పంపుతానని, బండి సంజయ్‌కి కూడా పంపిస్తానని స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News