పెండింగ్‌ ఫైళ్లపై సెక్రటేరియట్‌ లో కదలిక

సీఎంవో ఆదేశాలతో కదిలిన ఉన్నతాధికారులు

Advertisement
Update:2024-11-29 19:37 IST

తెలుగు గ్లోబల్‌ ఎఫెక్ట్‌


విధి నిర్వహణలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులపై సీఎంవో సీరియస్‌ కావడంతో సెక్రటేరియట్‌ తో పాటు పలు శాఖల ఆఫీసుల్లోనూ ఫైళ్లలో కదలిక వచ్చింది. సీఎంవో సహా వివిధ ప్రభుత్వ శాఖల్లో పెద్ద సంఖ్యలో ఫైళ్లు పేరుకుపోవడం, రెగ్యులర్‌, రొటీన్‌ ఫైళ్లను సైతం క్లియర్‌ చేయకుండానే పెండింగ్‌లో పెడుతున్నారని ''తెలుగు గ్లోబల్‌'' వరుస కథనాలు ప్రచురించింది. వీటిపై స్పందించిన సీఎంవో ఆయా శాఖల అధికారులను వివరణ కోరినట్టుగా తెలిసింది. రెగ్యులర్‌, రొటీన్‌ ఫైళ్లను పెండింగ్‌ పెట్టాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించింది. సర్వీస్‌ మ్యాటర్స్‌, ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ అనుమతులతో సంబంధం లేని ఫైళ్లను ఎందుకు పెండింగ్‌ పెట్టాల్సి వస్తుందని నిలదీసింది. దీంతో ఆఫీసర్లలో కదలిక వచ్చింది. శుక్రవారం పలు డిపార్ట్‌మెంట్లలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అనేక ఫైళ్లలో కదలిక వచ్చినట్టుగా సెక్రటేరియట్‌ లో చర్చ జరుగుతోంది. హెచ్‌ఎండీఏ, ఎంఏయూడీలో పలు ఫైళ్లకు మోక్షం వచ్చినట్టుగా చెప్తున్నారు. ఫైనాన్స్‌, జీఏడీ, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, లేబర్ తదితర శాఖల్లో పెద్దగా పెండింగ్‌ ఫైళ్లు లేకున్నా ఉన్నవాటిని ప్రయారిటీ మేరకు క్లియర్‌ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలిసింది. వేల్ఫేర్‌ శాఖలకు సంబంధించిన ఫైళ్లు, ఇష్యూస్‌ ను ఎప్పటికప్పుడే క్లియర్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారని సమాచారం. గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోన్న నేపథ్యంలో పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ శాఖలకు సంబంధించిన ఫైళ్ల క్లియరెన్స్‌ టాప్‌ ప్రయారిటీగా తీసుకున్నట్టు తెలుస్తోంది. హౌసింగ్‌, సివిల్‌ సప్లయీస్‌ డిపార్ట్‌మెంట్లలోనూ ఫైళ్లు ఎక్కువగా పెండింగ్‌లో ఉంచకుండా చర్యలు చేపట్టినట్టుగా తెలిసింది.

Tags:    
Advertisement

Similar News