ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరెస్ట్‌

ఆయన నివాసం వద్ద బీఆర్‌ఎస్‌ కార్యర్తలకు, పోలీసులకు వాగ్వాదం.. తీవ్ర ఉద్రిక్తత

Advertisement
Update:2024-12-05 11:17 IST

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని ఆయన నివాసం వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి స్టేషన్‌కు తరలించారు. విధులు అడ్డగించి బెదిరించారని ఇన్‌స్పెక్టర్‌ రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు కౌశిక్‌రెడ్డి సహా 20 మంది అనుచరులపై బుధవారం బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో గురువారం ఆయనను అరెస్టు చేశారు.క్రైం నెంబర్ 1127/ 2024 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించాడని, అత్యవసర విధులకు హాజరు కావాల్సి ఉండగా వాహనాన్ని అడ్డగించారు. దుర్భాషలాడుతూ బెదిరింపు లకు పాల్పడ్డారని, తన అనుచరులతో కలిసి పిఎస్ లో దౌర్జన్యం చేశాడని బంజారాహిల్స్ సీఐ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కౌశిక్‌పై 57,126 (2) 132 ,224,333,351,(3)191( 2) R/W 190 R/W 3 (5) పలు సెక్షన్ల పైన కేసు నమోదు చేశారు.

అంతకుముందు మాజీ మంత్రులు హరీశ్‌, జగదీశ్‌రెడ్డి పాటు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కౌశిక్‌రెడ్డి నివాసం వద్దకు చేరుకున్నారు. ఆయన ఇంట్లోకి వెళ్లడానికి హరీశ్‌రావు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి గేట్లు దూకి వెళ్లడానికి కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ క్రమంలో హరీశ్‌ రావును అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. హరీశ్‌ ను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకోవడానికి కార్యకర్తలు యత్నించారు. అలాగే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, రాకేష్ రెడ్డి లను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకున్నది. కాగా.. కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లిన మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, రాకేశ్‌రెడ్డి సహా పలువురు బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించాఉ. అదేవిధంగా గోడ దూకి వెళ్లడానికి ప్రయత్నించిన బీఆర్‌ఎస్‌ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్‌ తనను ఇంతకంటే ఎక్కువ చేయవద్దు, తమాషా చేయవద్దని బెదిరించారని హరీశ్‌రావు మండిపడ్డారు.హబీబుల్లా అన్నీ నోట్ చేసుకుంటున్నా.. ఎవ్రీ డే ఈజ్ నాట్ సండే.. ప్రతిరోజూ మీదే అనుకుంటున్నారేమో అని హరీశ్‌ హెచ్చరించారు.మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. కౌశిక్‌ రెడ్డిని ఎందుకు అరెస్టు చేస్తున్నారని ఆయన నిలదీశారు. కౌశిక్‌పై లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటున్నామని మీరు ఇక్కడ ఎందుకు అని పోలీసు ఆఫీసర్‌ ప్రశ్నించారు. మీరు సహకరించాలని, లేకపోతే మిమ్మల్ని కూడా పికప్‌ చస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో మీరు నన్ను అరెస్టు చేస్తున్నారా? అని జగదీశ్‌ ప్రశ్నించగా.. అవునని సమాధానం ఇచ్చారు. 




 


Tags:    
Advertisement

Similar News