వరంగల్ ఎయిర్‌పోర్ట్ భూసేకరణ వేగంగా పూర్తి చేయాలి
అధికారులకు మంత్రులు పొంగులేటి, కొండా ఆదేశం
వరంగల్ ఎయిర్ పోర్ట్ భూసేకరణను వేగంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ ఆదేశించారు. వరంగల్ నగరాభివృద్ధిపై బుధవారం సెక్రటేరియట్‌లో సమీక్షించారు. రింగ్ రోడ్డును నేషనల్ హైవేలకు కనెక్ట్ చేసేలా పనులు చేపట్టాలని, రింగ్ రోడ్డు భూసేకరణ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. భద్రకాళి చెరువును శుద్ధి చేసే పనుల్లోనూ వేగం పెంచాలని ఆదేశించారు. నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి, స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, సీడీఎంఏ శ్రీదేవి, మైనింగ్ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు సత్య శారద, ప్రావిణ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.