ఎల్బీనగర్ బాధితులకు మంత్రి కేటీఆర్ పరామర్శ

బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మంత్రి కేటీఆర్. వారి చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చూసుకుంటుందని ధైర్యం చెప్పారు.

Advertisement
Update:2023-06-21 17:41 IST

ఎల్బీనగర్ ఫ్లై ఓవర్ నిర్మాణ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో గాయపడినవారిని ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు మంత్రి కేటీఆర్. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారి చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చూసుకుంటుందని ధైర్యం చెప్పారు. ఎవరూ ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. ఇది దురదృష్టకరమైన సంఘటన అన్నారు.

ఎల్బీ నగర్ పరిధిలోని సాగర్ రింగ్ రోడ్డు వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ ర్యాంపు కూలిపోవడంతో 9 మంది కార్మికులకు గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన కార్మికులంతా బీహార్‌ కు చెందిన వారిగా గుర్తించారు. వారిని సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులను మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.


పూర్తి స్థాయి విచారణ..

ఈ ప్రమాదంపై పురపాలక శాఖ పూర్తిస్థాయి విచారణ చేపడుతుందని తెలిపారు మంత్రి కేటీఆర్.. ప్రమాదంపై ఇప్పటికే జీహెచ్ఎంసీ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆధ్వర్యంలో త్రీమెన్ కమిటీ ఏర్పాటు చేశారు. దీనికి అదనంగా జేఎన్టీయూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో విచారణ చేయించి, ప్రమాద కారణాలను తెలుసుకుంటామని, వర్కింగ్ ఏజెన్సీ నిర్లక్ష్యం వలన ప్రమాదం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Tags:    
Advertisement

Similar News