మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత
నాలుగు సార్లు లోక్‌సభకు ఎన్నికైన మందా
Advertisement
నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ, సీనియర్ నాయకుడు మందా జగన్నాథం ఆదివారం రాత్రి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో తుది శ్వాస విడిచారు. మందా జగన్నాథం నాగర్ కర్నూల్ నుంచి నాలుగు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికయ్యారు. టీడీపీ, కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచిన మందా తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీఆర్‌ఎస్ నుంచి 2014లో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సేవలందించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఎస్పీలో చేరారు. ఆయన మృతికి పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు,
Advertisement