గ్రేట్ జాబ్ రచన.. కేటీఆర్ సంతోషం
'వాట్ ఎ టెర్రిఫిక్ గెస్చర్' అంటూ.. ఆమె చేసిన పనిని అభినందించారు. 'గ్రేట్ జాబ్ రచన' అంటూ ప్రోత్సహించారు. అసలింతకీ రచన ఎవరు..? ఆమె ఏం చేశారు..?
ఈరోజు నా సంతోషానికి కారణం నువ్వేనమ్మా అంటూ మంత్రి కేటీఆర్ రుద్ర రచన అనే యువతిని మెచ్చుకున్నారు. 'వాట్ ఎ టెర్రిఫిక్ గెస్చర్' అంటూ.. ఆమె చేసిన పనిని అభినందించారు. 'గ్రేట్ జాబ్ రచన' అంటూ ప్రోత్సహించారు. అసలింతకీ రచన ఎవరు..? ఆమె ఏం చేశారు..?
ఎవరీ రచన..?
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తండ్రియాల్ గ్రామానికి చెందిన ఆ యువతి పేరు రుద్ర రచన. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోగా.. బాలసదనంలో పెరిగింది. చదువులో చురుగ్గా ఉండే రచన ఇంజినీరింగ్ కి ఇబ్బంది పడుతుందని తెలిసి మంత్రి కేటీఆర్ ఆమెకి అండగా నిలిచారు. బీటెక్ లో మంచి మార్కులు రావడంతో రచనకు ఏకంగా 4 సంస్థల్లో ఉద్యోగావకాశాలు వచ్చాయి. మంచి సంస్థలో ఉద్యోగంలో చేరిన రచన ఆ తర్వాత తనలాంటి అనాథలకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
ఉద్యోగంలో కుదురుకున్న తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కి రుద్ర రచన లక్ష రూపాయలు సాయం చేశారు. ఇటీవలే తన డొనేషన్ ని పంపించారు. దానికి సంబంధించిన సర్టిఫికెట్ సహా గతంలో తాను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ని కలసిన సందర్భాల్లో దిగిన ఫొటోలను కూడా ట్వీట్ చేశారు. తనలాంటి అనాథలకు అండగా ఉండేందుకే తాను ఈ సహాయం చేశానంటున్నారు రచన. థ్యాంక్స్ రామన్నా అంటూ ట్వీట్ చేశారు. రుద్ర రచన ట్వీట్ కి మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆమె గొప్ప మనసుని మెచ్చుకున్నారు.
ప్రభుత్వ సాయంతో పెద్ద చదువులు చదువుకుని, ఉద్యోగాల్లో కుదురుకున్నాక తన తోటివారికి అలాగే సాయపడాలని ఆలోచిస్తుంటారు చాలామంది. రుద్ర రచన కూడా అలాంటి గొప్ప మనసు ఉన్న యువతి అని నెటిజన్లు అభినందిస్తున్నారు.