ఎస్‌ఎల్‌బీసీని వదిలేసి ఇతర ప్రాజెక్టులపై లక్షల కోట్లు ఖర్చు చేసిన్రు

ఈ ప్రాజెక్టును పూర్తి చేయడమే మా సర్కారు లక్ష్యం : మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

Advertisement
Update: 2024-09-20 13:19 GMT

రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన కేసీఆర్‌ ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీని వదిలేసి ఇతర ప్రాజెక్టులపై లక్షల కోట్లు ఖర్చు చేసిందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం మన్నెం వారిపల్లెలో నిర్వహించిన సమావేశంలో మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ, గ్రావిటీతో నీళ్లొచ్చే ఎస్‌ఎల్‌బీసీని వదిలేసి కాళేశ్వరంపై రూ.లక్ష కోట్లు, పాలమూరు - రంగారెడ్డిపై రూ.25 వేల కోట్లు, సీతారామ ఎత్తిపోతలపై రూ.10 వేల కోట్లు ఖర్చు చేశారని అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ పూర్తయితే 4 లక్షల ఎకరాల్లో పంటలు పండేవని.. 700 గ్రామాలకు సురక్షితమైన తాగునీరు అందేదని అన్నారు. ఈ టన్నెల్‌ పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు ఇస్తుందని తెలిపారు. ఇకపై శరవేగంగా పనులు చేస్తామన్నారు. రూ.3,500 కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేదన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేయడమే తమ ముందున్న కర్తవ్యమని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్‌ లో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు.

Tags:    
Advertisement

Similar News