పోలీసుల దాడిలో గాయపడిన ఆశా వర్కర్లను పరామర్శించిన కేటీఆర్

నిన్న పోలీసుల దాడిలో గాయపడిన ఆశా వర్కర్లను ఉస్మానియా ఆసుపత్రిలో బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పరామర్శించి ధైర్యం చెప్పారు

Advertisement
Update:2024-12-10 13:45 IST

నిన్న పోలీసుల దాడిలో గాయపడిన ఆశా వర్కర్లను ఉస్మానియా ఆసుపత్రిలో బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పరామర్శించి ధైర్యం చెప్పారు. కేటీఆర్ ఉస్మానియా ఆసుపత్రికి రాకతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కేటీఆర్ తో పాటు కొంతమందిని మాత్రమే ఆసుపత్రి లోపలికి అనుమతించటంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. నినాదాలు చేస్తూ ఆందోళన చేస్తున్నారు బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు. అటు ఇవాళ అసెంబ్లీ ముట్టడికి ఆశా వర్కర్లు పిలుపునిచ్చారు.

ఈ తరుణంలోనే.. ఎక్కడిక్కడే జిల్లాల వారీగా ఆశా వర్కర్లను అడ్డుకున్నారు పోలీసులు. కొంత మందిని అరెస్ట్ చేశారు. కోఠిలోని డీఎంఈ కార్యాలయం ముందు నిన్న ఆందోళనలో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఓ ఆశావర్కర్ సొమ్మసిల్లి పడిపోయింది. ఈ క్రమంలో ఆమెను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరిలించారు. పరామర్శించిన వారిలో కేటీఆర్ తో పాటు ఎంఎల్ఏ లు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు

Tags:    
Advertisement

Similar News