మోడీకి మళ్లీ ఓటేస్తే.. లీటర్ పెట్రోల్ రూ.400 - కేటీఆర్ ట్వీట్
అబ్ కీ బార్.. చార్ సౌ పార్ అన్న స్లోగన్‌ను నమ్మితే ఆగమేనన్నారు కేటీఆర్. చార్ సౌ అనేది బీజేపీ సీట్ల సంఖ్య కాదని.. పెట్రోల్ రేట్ల గురించి అంటూ ట్వీట్ చేశారు.
Advertisement
కేంద్రంలోని మోడీ సర్కార్‌పై మరోసారి సెటైర్లు వేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్ర సర్కార్ ధరలు పెంచి పేదలపై భారం మోపుతోందని ట్వీట్ చేశారు. పెట్రోల్ ధరలతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తోందని కామెంట్ చేశారు.
అబ్ కీ బార్.. చార్ సౌ పార్ అన్న స్లోగన్‌ను నమ్మితే ఆగమేనన్నారు కేటీఆర్. చార్ సౌ అనేది బీజేపీ సీట్ల సంఖ్య కాదని.. పెట్రోల్ రేట్ల గురించి అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఓ వీడియోను కూడా యాడ్ చేశారు కేటీఆర్.
2014లో లీటర్ పెట్రోల్ ధర రూ.70గా ఉంటే.. 2024 నాటికి లీటర్ పెట్రోల్ ధర రూ. 110కి చేరిందన్నారు. ఇప్పుడు మరోసారి బీజేపీకి ఓటు వేస్తే 2029 నాటికి లీటర్ పెట్రోల్ ధర రూ. 400కు చేరే అవకాశముందన్నారు కేటీఆర్.
Advertisement