రాహుల్‌, మీరైనా పట్టించుకోండి.. కేటీఆర్ రిక్వెస్ట్‌!

మీ ప్రభుత్వం 2 లక్షల రిక్రూట్‌ మెంట్ ప్రక్రియను ఎలా నిర్వహిస్తుంది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వంలో ఎవరూ పట్టించుకోవడం లేదు.. కనీసం మీరైనా స్పందించండి అని రాహుల్‌ను కోరారు కేటీఆర్.

Advertisement
Update: 2024-07-01 04:39 GMT

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచినా ఒక్క నోటిఫికేషన్‌ కూడా రిలీజ్ చేయకపోవడంపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పటివరకూ జాబ్ క్యాలెండర్‌ కూడా ప్రకటించలేదన్నారు. కాంగ్రెస్‌ సీనియర్ నేత రాహుల్‌ గాంధీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.

కేటీఆర్ ట్వీట్ ఇదే..

ప్రియమైన రాహుల్‌ గాంధీజీ, మీరు వ్యక్తిగతంగా నిరుద్యోగులను కలిశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని పూర్తిచేస్తామని తెలంగాణ యువకులకు హామీ ఇచ్చారు. మీ వాగ్దానాన్ని అనుసరించే.. తేదీలతో పాటు అన్ని ప్రముఖ వార్తాపత్రికల్లో ఉద్యోగ క్యాలెండర్‌ ను కూడా మీ పార్టీ ప్రచురించింది. ఇప్పటికి 7 నెలలు దాటిపోయినా ఒక్క కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదు. ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయకుండా మీ ప్రభుత్వం 2 లక్షల రిక్రూట్‌ మెంట్ ప్రక్రియను ఎలా నిర్వహిస్తుంది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వంలో ఎవరూ పట్టించుకోవడం లేదు.. కనీసం మీరైనా స్పందించండి అని రాహుల్‌ను కోరారు కేటీఆర్.




 

ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగులను కలిసిన టైమ్‌లో రాహుల్‌ గాంధీ చేసిన ట్వీట్‌తో పాటు అప్పుడు కాంగ్రెస్ పార్టీ వార్తా పత్రికల్లో ఇచ్చిన జాబ్ క్యాలెండర్‌ను తన ట్వీట్‌కు జోడించారు కేటీఆర్. మరోవైపు ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News