అప్పుల్లో రికార్డులు బద్దలు... ఇదే కాంగ్రెస్ తెచ్చిన మార్పు

అప్పుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డులు బ్రేక్ చేస్తోందన్నారు కేటీఆర్. రోజుకి 200 కోట్ల రూపాయలకు పైగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పులు తెస్తోందన్నారు.

Advertisement
Update:2024-08-14 10:38 IST

తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల కుప్పలా మార్చబోతోందని హెచ్చరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇదే వారు తీసుకొస్తున్న మార్పు అంటూ ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. గతేడాది రూ.5,900 కోట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదాయంలో మిగులుని చూపెట్టిందని.. 8 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం 50వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిందని చెప్పారు కేటీఆర్.


అప్పులు తెచ్చారు సరే, దానికి తగ్గట్టుగా అభివృద్ధి జరగలేదని అంటున్నారు కేటీఆర్. ఒక్క ఇన్ ఫ్రా ప్రాజెక్ట్ కూడా కొత్త ప్రభుత్వం తీసుకు రాలేదని, పైగా అప్పులు మాత్రం పెరిగిపోతున్నాయని అన్నారు. ఇదే నిష్పత్తిలో అప్పులు చేసుకుంటూ పోతే.. రాబోయే రోజుల్లో 4 నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు మిగులుతాయని, ఇదంతా తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ సర్కారు మోపబోతున్న భారం అని వివరించారు. అదే సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిందలు వేస్తూ కాంగ్రెస్ కాలక్షేపం చేస్తోందన్నారు. తమ పాలనపై నిందలు వేయడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్.. అపోహలు, అర్థ సత్యాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు కేటీఆర్.

అప్పుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డులు బ్రేక్ చేస్తోందన్నారు కేటీఆర్. ప్రజలను వారు విజయవంతంగా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రోజుకి 200 కోట్ల రూపాయలకు పైగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పులు తెస్తోందన్నారు. 

Tags:    
Advertisement

Similar News