మొద్దునిద్ర వీడినందుకు సంతోషం.. కాంగ్రెస్ పై కేటీఆర్ ఘాటు ట్వీట్

బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో వెయ్యికి పైగా గురుకులాలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో పరిస్థితులు సరిగా లేవని చెప్పారు.

Advertisement
Update:2024-08-13 13:33 IST

తెలంగాణ గురుకులాల్లో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని, తక్షణ చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదివరకే ప్రభుత్వానికి సూచించారు. ఇటీవల హాస్టళ్లలో జరిగిన వరుస సంఘటనలను కూడా ఆయన ప్రస్తావించారు. కేటీఆర్ సూచనతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురుకులాల సందర్శనకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ మరో ఆసక్తికర ట్వీట్ వేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర వీడినందుకు సంతోషం అన్నారాయన.


బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో వెయ్యికి పైగా గురుకులాలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో పరిస్థితులు సరిగా లేవని చెప్పారు. గురుకులాల సందర్శనకు బయలుదేరిన డిప్యూటీ సీఎం టీమ్.. తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్టు తెలిపారు కేటీఆర్. గురుకులాల్లో ఆహార నాణ్యతను మెరుగుపరచాలని, ఇకపై ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఇటీవల తెలంగాణలోని గురుకులాల్లో వరుస దుర్ఘటనలు జరుగుతున్నాయి. 8 నెలల కాంగ్రెస్ పాలనలో 36మంది హాస్టల్ పిల్లలు చనిపోయారు. అటు మిడ్ డే మీల్స్ నాసిరకంగా ఉండటంతో విద్యార్థులు కూడా ఫుడ్ పాయిజన్ తో అవస్థలు పడుతున్నారు. వీటన్నిటినీ సరిచేయాలని కేటీఆర్ ప్రభుత్వానికి సూచించారు. ఆయన ఒత్తిడితోనే ఇప్పుడు కాంగ్రెస్ నేతలు గురుకులాల సందర్శనకు బయలుదేరారు. నష్టనివారణ చర్యలు చేపట్టారు. 

Tags:    
Advertisement

Similar News