కేఆర్‌ఎంబీ సమావేశం ప్రారంభం
ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చిస్తున్న అధికారులు
Advertisement
నగరంలోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశం ప్రారంభమైంది. కేఆర్‌ఎంబీ ఛైర్మన్ అతుల్‌జైన్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో తెలంగాణ, ఏపీ నుంచి జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు. తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్, ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు ఈ భేటీకి హాజరయ్యారు.
ఈ సమావేశంలో వివిధ అంశాలపై అధికారులు చర్చిస్తున్నారు. రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల విడుదల, ఇప్పటివరకు వినియోగం, జలాశయాల్లో నిల్వలు, కృష్ణా పరీవాహకంలో టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు, సాగర్, శ్రీశైలం జలాశయాల ఆనకట్టల మరమ్మతులు బోర్డుకు నిధుల కేటాయింపు, రెండు రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులపై పరస్పర ఫిర్యాదులు తదితరాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
Advertisement