బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎంపికపై కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
వారం రోజుల తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నిక ఉంటుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎంపికపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్‌ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ అవసరం లేదని.. రెండు సార్లు బీజేపీ క్రియా శీలక సభ్యత్వం ఉంటే చాలు అని కిషన్‌రెడ్డి తెలిపారు.రెండు సార్లు బీజేపీ గుర్తు పై పోటీ చేసినా సరిపోతుందని అన్నారు. మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ కూడా బీజేపీ అధ్యక్ష రేసులో ఉంటారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని కిషన్ రెడ్డి నివాసంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొనడం పై కూడా కిషన్ రెడ్డి స్పందించారు. “పిలిస్తే.. నా మాట కాదనకుండా చిరంజీవి వస్తారు. ఆయనతో నాకు మంచి సంబందాలు ఉన్నాయి.
ఇద్దరం ఒకరిని ఒకరం కుటుంబ సభ్యుల్లా భావిస్తాం” అంటూ సమాధానం చెప్పారు. వారం రోజుల తర్వాత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారని కిషన్‌రెడ్డి తెలిపారు. బీజేపీలో కొత్త సభ్యత్వాలు, పోలింగ్ బూత్ కమిటీలు,మండల కమిటీలు పూర్తయ్యాయి. జిల్లా కమిటీల ఎన్నిక ప్రక్రియ నడుస్తోంది. 600 మండల కమిటీలు పూర్తి చేస్తామని అందులో 50 శాతంపైగా బీసీలకే అధ్యక్ష బాధ్యతలు ఇచ్చామన్నారు. పార్టీలో మహిళలకు 33 శాతం పదవులు ఇస్తామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. పంచాయతీలకు కేంద్రం నుంచి మూడు వాయిదాల నిధులు రాలేదంటే అందుకు కారణం స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడమే. రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతాయాని కేంద్రమంత్రి ప్రశ్నించారు.