కిషన్‌ రెడ్డి డీఎన్‌ఏ పరీక్ష చేయించుకోవాలి

ఆయన తెలంగాణ బిడ్డేనా : మంత్రి పొన్నం ప్రభాకర్‌

Advertisement
Update:2024-11-16 19:25 IST

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి డీఎన్‌ఏ పరీక్ష చేయించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. వరంగల్‌ పర్యటనలో భాగంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు ఆయన తెలంగాణ బిడ్డేనా అని సందేహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ డైరెక్షన్‌ లోనే కిషన్‌ రెడ్డి ఒకరోజు మూసీ నిద్ర అంటున్నారని మండిపడ్డారు. మూసీ నిద్ర కాదు ముందు ఆయన మొద్దు నిద్ర వీడాలన్నారు. మూసీ మురికి వాసన చూసిన తర్వాతనైనా దేవుడి సాక్షిగా నిజాలు చెప్పాలన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు ఒక్క రూపాయి సాయం కూడా తెచ్చే శక్తి కిషన్‌ రెడ్డికి లేదన్నారు. కలెక్టర్‌ ను కొట్టిన వారిని సమర్థిస్తున్న ఆయన కేంద్ర మంత్రిగా కొనసాగడానికి ఎలా అర్హుడని ప్రశ్నించారు. ఐఏఎస్‌ అధికారిపై దాడి జరిగితే కేంద్ర మంత్రిగా ఖండించకపోగా సమర్థించడం ఏమిటన్నారు. అధికారులను కొట్టినోన్ని, కొట్టిచ్చినోన్ని వదిలేదని వార్నింగ్‌ ఇచ్చారు. హైడ్రా, మూసీ, అధికారులపై దాడి ఘటనపై బీజేపీ వైఖరి ఏమిటో చెప్పాలన్నారు. 

Tags:    
Advertisement

Similar News