చైనీస్‌ మాంజాపై హైదరాబాద్‌ సీపీ కీలక వ్యాఖ్యలు

స్థానికంగా తయారుచేయడం వల్లనే ఇది పెద్ద మొత్తంలో లభ్యమౌతున్నదన్న సీవీ ఆనంద్‌

Advertisement
Update:2025-01-15 14:21 IST

చైనీస్‌ మాంజాపై హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానికంగా తయారుచేయడం వల్లనే ఇది పెద్ద మొత్తంలో లభ్యమౌతున్నదని చెప్పారు. ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌లో ఆర్డర్‌ చేసుకుంటే ఇంటికే వస్తున్నదని పేర్కొన్నారు. త్వరలో ఈ-కామర్స్‌ గోదాములపై సోదాలు చేస్తామన్నారు. నిర్వాహకులతో సమావేశం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. చైనీస్‌ మాంజా వినియోగాన్ని అరికట్టడంలో ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే సాధ్యమౌతుందని స్పష్టం చేశారు. 

Tags:    
Advertisement

Similar News