నేటి నుంచే కేసీఆర్ బస్సు యాత్ర.. ఇవాల్టి షెడ్యూల్ ఇదే..!

బస్సు యాత్రోలో భాగంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఉదయం రైతులతో నేరుగా మాట్లాడి వారి కష్టాలను తెలుసుకుంటారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్‌ ప్రత్యేకంగా సమావేశమవుతారు.

Advertisement
Update:2024-04-24 08:12 IST

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఇవాల్టి నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్ యాత్ర కొనసాగించనున్నారు. బస్సు యాత్ర ఇవాళ మొదలై 17 రోజుల వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా ప్రతీరోజు ఉదయం పొలం బాట.. సాయంత్రం ప్రజలతో మాట ఉండేలా షెడ్యూల్ రూపొందించారు.

ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు తెలంగాణ భవన్‌ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఉప్పల్, ఎల్బీనగర్, నకిరేకల్ క్రాస్‌ రోడ్డు, నల్గొండ, మాడుగులపల్లి మీదుగా మిర్యాలగూడ చేరుకోనున్న కేసీఆర్‌..అక్కడ సాయంత్రం రోడ్‌ షోలో పాల్గొంటారు. తర్వాత వేములపల్లి,మాడుగులపల్లి, తిప్పర్తి, నార్కట్‌పల్లి బైపాస్‌ రోడ్డు, కేతేపల్లి మీదుగా సూర్యాపేట చేరుకుంటారు. సూర్యాపేటలో రోడ్‌షోలో పాల్గొంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు.

బస్సు యాత్రోలో భాగంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఉదయం రైతులతో నేరుగా మాట్లాడి వారి కష్టాలను తెలుసుకుంటారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్‌ ప్రత్యేకంగా సమావేశమవుతారు. సాయంత్రం కనీసం 2-3 ప్రాంతాల్లో రోడ్‌షోల్లో పాల్గొంటారు. కార్నర్‌ మీటింగ్స్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడతారు.

మే 10న కేసీఆర్ బస్సు యాత్ర ముగియనుంది. చివరి రోజు సిరిసిల్లలో సాయంత్రం 5 గంటలకు రోడ్‌షోలో పాల్గొని.. అదే రోజు సాయంత్రం సిద్దిపేటలో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు. తర్వాత హైదరాబాద్‌కు పయనమవుతారు.

Tags:    
Advertisement

Similar News