కాంగ్రెస్ జెండాలతో కార్యకర్తలు .. యువ ఐపీఎస్ పెళ్లి రద్దు
కాంగ్రెస్ కార్యకర్తల అత్యుత్సాహంతో ఓ యువ ఐపీఎస్ వివాహం పెళ్లిపీటలపై ఆగిపోయింది.
కాంగ్రెస్ కార్యకర్తల అత్యుత్సాహంతో ఓ యువ ఐపీఎస్ వివాహం పెళ్లిపీటలపై ఆగిపోయింది. దీంతో పెళ్లికుమార్తె తల్లికి గుండెపోటు వచ్చింది. పెళ్లి కొడుకు ఇంటిముందు పెళ్లికూతురు బంధువులు ఆందోళన చేయగా.. చివరకు ఐపీఎస్ పెళ్లికి అంగీకరించాడు. ఉమ్మడి పాలమూరు జిల్లా అలంపూర్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కుమార్తె ఎంబీబీఎస్ చదివింది.. ఆమెకు గుజరాత్ క్యాడర్‌లో పనిచేస్తున్న గుంటూరు యువ ఐపీఎస్ అధికారితో పెళ్లి ఖాయం అయింది. నిన్న సాయంత్రం గుంటూరులోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో పెళ్లి ఉండగా, వధూవు కాంగ్రెస్ జెండాలతో ఊరేగింపుగా వెళ్లాలని పట్టుబట్టింది.. దీనికి ఐపీఎస్ బంధువులు వద్దని వారించారు. పెళ్లి కొడుకు ఐపీఎస్ అధికారి కావడంతో ఇలా పార్టీ జెండాలు పట్టుకొస్తే ఇబ్బంది అవుతుందని దీనికి నిరాకరించాడు.
దీంతో వివాహం ఆగిపోగా వధువు తల్లికి తీవ్ర గుండెపోటు వచ్చింది. ముందు వరుడు తరపు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేయగా వారు ససేమిరా అన్నారు.. దీంతో పెళ్లి కొడుకు తరపు వారిని బుజ్జగించారు. ఏడు గంటల పాటు చర్చి పెద్దలు, పాస్టర్లు బుజ్జగించి ఐపీఎస్ అధికారిని వివాహానికి ఒప్పించారు. దీంతో నిన్న జరగాల్సిన పెళ్లి ఈరోజు ఉదయం జరిగింది. ఏడడుగుల కోసం ఏడు గంటల పాటు చర్చి పెద్దలు, పాస్టర్లు బుజ్జగించి ఐపీఎస్ అధికారిని వివాహానికి ఒప్పించారు. ముందు పెళ్లి కూతురు తరపు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేయగా వారు ససేమిరా అన్నారు.. దీంతో పెళ్లి కొడుకు తరపు వారికి బుజ్జగించారు.