రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఛలో రాజ్ భవన్ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గోన్నారు.

Advertisement
Update:2024-12-18 13:36 IST

ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఛలో రాజ్ భవన్ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గోన్నారు. అదానీ వ్యవహారం, మణిపూర్ అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలంటూ ముఖ్యమంత్రి రోడ్డుపై బైఠాయించారు. టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్‌కు ర్యాలీ వెళ్లారు. ప్లకార్డులతో వెళ్లున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో సీఎం రేవంత్ రోడ్డుపైనే బైఠాయించారు. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పై కాంగ్రెస్ నిరసనలు చేపడుతోంది. దేశంలో రాజ్యాంగినికి ముప్పు పొంచి ఉందని తెలిపారు.

జమిలీ ఎన్నికలు దేశానికి చాలా ప్రమాదకరం అంటూ పేర్కొంటున్నారు కాంగ్రెస్ నేతలు. జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. అవినీతి, మోసం, మనీలాండరింగ్, మార్కెట్ మానిప్యులేషన్ లాంటి అంశాలలో అదానీ దేశ ప్రతిష్టను దెబ్బతీశారని తీవ్ర విమర్శలు చేశారు. మణిపూర్‌లో వరుసగా జరిగిన అల్లర్లు, విధ్వంసాలపై మోదీ స్పందించకపోవడంపై కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనల్లో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్‌ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News