అసెంబ్లీలో భూ భారతి బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి పొంగులేటి

తెలంగాణ శాసనసభలో భూ భారతి బిల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రవేశపెట్టారు.

Advertisement
Update:2024-12-18 12:11 IST

తెలంగాణ శాసనసభలో భూ భారతి బిల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రవేశపెట్టారు. భూములు ఉన్న ప్రతీ ఒక్కరికీ పూర్తిగా భద్రత కల్పించే విధంగా తయారు చేశామని పొంగులేటి తెలిపారు. ధరణీలో పార్ట్ బీకి సంబంధించి 18లక్షల 26వేల ఎకరాలను ఈ చట్టం ద్వారా ప్రైవేట్, ప్రభుత్వ భూమి అయితే ఏ కారణం చేత పార్ట్ బీలో పెట్టారని సమస్యను పరిష్కరించేవిధంగా చట్టం తీసుకొచ్చామని తెలిపారు. ధరణి వల్ల, 2020 చట్టం వల్ల లక్షలాదిమంది ప్రజలకు సమస్యలు వచ్చాయి. ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో పడేశామన్నారు. భూములను కంటికి రెప్పలా కాపాడే బాధ్యత మా ప్రభుత్వాన్ని విన్నారు.

ప్రజలకు సంబంధించిన ఆస్తులకు పూర్తి భద్రత ఈ చట్టం ద్వారా పరిష్కరించడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతంలో ఉండే ఇండ్లు ఉన్న స్థలాలకు ఏ రకమైన టైటిల్ ఉండదు. గ్రామకంఠాలకు పరిష్కారమార్గం కనుక్కొనేది ఈ చట్టంలో పొందుపరిచాం. వారికి హక్కు ఉన్న కార్డును ఈ చట్టంలో పేర్కొనబడిందని మంత్రి తెలిపారు. ఈ రోజు చరిత్రాత్మకమైన రోజు. భుమి ఆత్మగౌరవంతో బతికే అవకాశం ఇస్తుందని ధరణితో రైతులు ఇబ్బంది పడ్డారు. లోప భూయిష్టమైన 2020 ఆర్వోఆర్ చట్టాన్ని రద్దు చేశాం. కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకొస్తున్నాం అని చెప్పారు

Tags:    
Advertisement

Similar News