ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక మీటింగ్

ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని గుర్తు చేశారు కేసీఆర్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్న‌ద‌ని, తక్కువ కాలంలోనే కాంగ్రెస్ విఫల ప్రభుత్వంగా పేరు తెచ్చుకుందని అన్నారు.

Advertisement
Update: 2024-06-25 11:55 GMT

తెలంగాణలో జంపింగ్ పాలిటిక్స్ హాట్ టాపిక్ గా మారాయి. బీఆర్ఎస్ నుంచి రోజుకొక ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకోవడం సంచలంగా మారింది. ఈ చేరికలతో అటు కాంగ్రెస్ లో కూడా ముసలం మొదలైంది. ఈ వ్యవహారాలను పక్కనపెడితే.. ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో వారితో సమావేశమయ్యారు. పార్టీ నేతలెవరూ తొందరపడొద్దని ఆయన సూచించారు. గతంలో కూడా ఇలాంటి పరిణామాలు జరిగాయని, ఇంకా ఏదో జరిగిపోతుందని భయపడొద్దని, బీఆర్ఎస్ ఇప్పటికీ పటిష్టంగా ఉందని, మంచిరోజులొస్తాయని, ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యేలు, నేతలకు చెప్పారు కేసీఆర్.

ఎర్ర‌వ‌ల్లి వ్యవసాయ క్షేత్రంలో జరిగిన ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్, మాగంటి గోపీనాథ్‌, ముఠా గోపాల్, మాధవరం కృష్ణా రావు, అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్‌, ఇతర నేతలు పాల్గొన్నారు. వారందరితో మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు కేసీఆర్. రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టి మారడాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేద‌ని అన్నారు కేసీఆర్.

ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని గుర్తు చేశారు కేసీఆర్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్న‌ద‌ని, తక్కువ కాలంలోనే కాంగ్రెస్ విఫల ప్రభుత్వంగా పేరు తెచ్చుకుందని అన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ కి మంచి రోజులు వస్తాయ‌ని చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన నష్టమేమీ లేదని అన్నారు. ఇకపై తాను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తరచూ సమావేశమవుతానని భరోసా ఇచ్చారు. నేతలెవరూ తొందరపడొద్దని, కాంగ్రెస్ ప్రలోభాలకు మోసపోవద్దని చెప్పారు కేసీఆర్. 

Tags:    
Advertisement

Similar News