TSPSC పేపర్ లీక్ వ్యవహారంపై కేసీఆర్ సీరియస్... ఉన్నత స్థాయి సమావేశం
TSPSC పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో కేసీఆర్ ఈ రోజు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఛీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, TSPSC చైర్మెన్ జనార్ధన్ రెడ్డి, మాజీ చైర్మెన్ చక్రపాణితో సహా పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
TSPSC పేపర్ లీక్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. పేపర్ లీక్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. TSPSC పలు ఎగ్జామ్స్ ను రద్దు చేసింది. మరో వైపు ప్రతిపక్షాలు ఈ వ్యవహారంపై ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.
ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. ఎన్నడూ లేని విధంగా TSPSC లో ఇలా పేపర్లు లీక్ అవడం ఆయనను అసహనానికి గురిచేసిందని చెప్తున్నారు.
ఈనేపథ్యంలో ఆయన ఈ రోజు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఛీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, TSPSC చైర్మెన్ జనార్ధన్ రెడ్డి, మాజీ చైర్మెన్ చక్రపాణితో సహా పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
TSPSC చైర్మెన్ జనార్ధన్ రెడ్డి రాజీనామాచేయాలన్న డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతుండటం ఉత్కంటను కలిగిస్తోంది. ఈ సమావేశంలో TSPSCకి సంబంధించి పలు ముఖ్య నిర్ణయాలు తీసుకోనున్నారని సమాచారం.