హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్‌ పిటిషన్లు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్లు దాఖలు చేశారు.

Advertisement
Update:2024-12-23 20:40 IST

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తెలంగాణ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్లు దాఖలు చేశారు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందన్న అంశంపై భూపాలపల్లి కోర్టు ఇచ్చిన నోటీసులను కొట్టివేయాలని కోరారు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ గతంలో భూపాలపల్లి కోర్టులో ప్రైవేట్‌ పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం గత జులై 10న మాజీ సీఎం కేసీఆర్‌, హరీశ్‌రావుకు నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చిన నోటీసులను కొట్టివేయాలని కోరుతూ తాజాగా క్వాష్‌ పిటిషన్లు దాఖలు చేశారు.

Tags:    
Advertisement

Similar News