డిప్యూటీ సీఎం పవన్‌‌ను కలిసిన కాంగ్రెస్ నేత వీహెచ్

కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరును పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్‌‌ను కాంగ్రెస్ నేత వీహెచ్ కోరారు

Advertisement
Update:2025-02-25 21:22 IST

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంత రావు కలిశారు. మంగళగిరిలో ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిశారు. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరును పెట్టాలని ఈ సందర్భంగా వీహెచ్ విజ్ఞప్తి చేశారు. దామోదరం సంజీవయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారని ఈ సందర్భంగా వీహెచ్ గుర్తు చేశారు. సామాజిక పెన్షన్లు రావడంలో, కార్మికులకు వివిధ రకాల ప్రయోజనాలు కల్పించడంలో సంజీవయ్య పాత్ర ఎంతో ఉందని అన్నారు.

ఈ నేపథ్యంలో ఆయన పేరుతో స్మారక భవనాన్ని నిర్మించాలని కోరారు. ఈ అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళతానని వీహెచ్ కు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ఈ భేటీ సందర్భంగా పవన్ కల్యాణ్... వీహెచ్‌కు శాలువాను కప్పి సత్కరించారు. వినాయకుడి విగ్రహాన్ని బహూకరించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఒక జిల్లాకు దివంగత నేత, మాజీ సీఎం దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని వీహెచ్, సీఎం చంద్రబాబును కోరారు. అలాగే దామోదరం సంజీవయ్య పేరుతో స్మృతివనం నిర్మించాలని వీహెచ్ చంద్రబాబును కోరారు. ఇందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారని వీహెచ్ తెలిపారు

Tags:    
Advertisement

Similar News