జూనియర్ పీఎస్ ల పంచాయితీ మళ్లీ మొదటికొచ్చేనా..?

మంగళవారం జేపీఏస్ లను నాలుగో గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు స్పష్టంగా పేర్కొంది. అయితే జేపీఎస్ ల అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందో లేదో చూడాలి.

Advertisement
Update:2023-08-08 17:15 IST

తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల(జేపీఎస్)ను నాలుగో గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో జేపీఎస్ లు హ్యాపీయేనని చెప్పాలి. కానీ నియమ నిబంధనలతో కొంతమంది ఇబ్బంది పడుతున్నారు.

గైడ్ లైన్స్ ఏంటి..?

నిరాటంకంగా నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకొని ఉండాలి.

జిల్లాస్థాయి కమిటీ వేసే మార్కుల్లో 70శాతం పైగా సాధించాలి.

మార్కులు తగ్గితే మరో ఏడాది తర్వాతే పర్మినెంట్ చేసే అవకాశం.

ప్రస్తుతం తెలంగాణలో 9,355మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. నాలుగేళ్లు కంటిన్యూగా సర్వీసు పూర్తి చేసుకోవాలి అనే నిబంధనల వల్ల ఇందులో కేవలం 5,435మంది మాత్రమే పర్మినెంట్ అవుతారు. దీంతో మిగతావారు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే దాదాపు నాలుగేళ్లు సర్వీసు పూర్తి చేసుకోబోతున్నామని, కంటిన్యూగా సర్వీసు అంటే కష్టమని చెబుతున్నారు. ఇక జిల్లా కమిటీ మార్కుల విషయంలో కూడా కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు. కమిటీ వేసే మార్కులను పరిగణలోకి తీసుకోవడం కూడా కొంతమందికి నచ్చడంలేదు. పైగా మార్కులు తక్కువ వస్తే మరో ఏడాది పాటు వేచి చూడాలనే నిబంధన కూడా ఇబ్బందిగా మారింది. దీంతో జూనియర్ కార్యదర్శులు అసంతృప్తితో ఉన్నారు.

మంగళవారం జేపీఏస్ లను నాలుగో గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు స్పష్టంగా పేర్కొంది. అయితే జేపీఎస్ ల అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందో లేదో చూడాలి.

Tags:    
Advertisement

Similar News