ఇందిరమ్మ ఇళ్ల కమిటీ ఏర్పాటుపై జీవో విడుదల

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారులను గుర్తించేందుకు కమిటీలను ఏర్పాటు చేయాలని జీవో విడుదల విడుదల చేశారు

Advertisement
Update:2024-10-11 18:38 IST

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారులను గుర్తించేందుకు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్‌, వార్డు స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రామస్థాయిలో సర్పంచి లేదా ప్రత్యేక అధికారి, కౌన్సిలర్‌ లేదా కార్పొరేటర్‌ ఛైర్మన్‌గా మున్సిపాలిటీ స్థాయిలో కమిటీని ఏర్పాటు చేయనున్నారు. పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు ఆఫీసర్‌ ఇందిరమ్మ ఇళ్ల కమిటీ కన్వీనర్‌గా ఉంటారని జీవోలో ప్రభుత్వం పేర్కొంది.

ఇద్దరు ఎస్‌హెచ్‌జీ గ్రూపు సభ్యులు, ముగ్గురు స్థానికులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. కాగా ఈ కమిటీలు శనివారం నాటికి ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు అందాయి. కమిటీల కోసం పేర్లు పంపాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ కమిటీలు ఇందిరమ్మ ఇళ్ల అర్హులకు అవగాహన కల్పించడంతోపాటు, అనుమానాలు నివృత్తి చేస్తారు.

Tags:    
Advertisement

Similar News