డిజిటల్‌ కార్డులపై అదంతా ఫేక్‌ న్యూస్‌

ఆ ప్రచారం నమ్మి మోసపోవద్దు.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

Advertisement
Update:2024-10-07 18:24 IST

ఫ్యామిలీ డిజిటల్‌ కార్డులపై తాము ఎలాంటి అప్లికేషన్‌ విడుదల చేయలేదని.. సోషల్‌ మీడియాలో సర్క్యూలేట్‌ అవుతున్నదంతా ఫేక్‌ న్యూస్‌ అని సివిల్‌ సప్లయీస్‌ డిపార్ట్ మెంట్‌ వివరణ ఇచ్చింది. తెలుగు భాషలో ఫ్యామిలీ డిజిటల్‌ కార్డ్‌ అప్లికేషన్‌ ను అసలు రూపొందించనే లేదని స్పష్టం చేశారు. ప్రజల నుంచి తాము ఎలాంటి దరఖాస్తులు కూడా స్వీకరించడం లేదని క్లారిటీ ఇచ్చారు. సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్న అప్లికేషన్‌ ను పరిగణలోకి తీసుకోవద్దని సూచించారు. రేషన్‌ కార్డులు లేని కుటుంబాలు అప్లికేషన్‌ ఫామ్‌ నింపి, కుటుంబ సభ్యుల ఆధార్‌ నంబర్‌ లు, బర్త్‌ సర్టిఫికెట్లు, ఫొటోతో వీఆర్వోకు ఇవ్వాలని ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రజలు పెద్ద సంఖ్యలో రేషన్‌, డిజిటల్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ ప్రచారాన్ని నమ్మి ప్రజలు మోసపోవద్దని సివిల్‌ సప్లయీస్‌ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

Tags:    
Advertisement

Similar News