హైడ్రా మరో కీలక నిర్ణయం
ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవాలని నిర్ణయం
Advertisement
ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు కొత్త ఏడాదిలో ప్రతి సోమవారం బుద్ధభవన్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణలపై అర్జీలు ఇవ్వవచ్చని హైడ్రా పేర్కొన్నది.
Advertisement