హైడ్రా గ్రీవెన్స్‌ సెల్‌

ప్రతి సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ

Advertisement
Update:2025-01-04 19:44 IST

ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ నిర్ణయించారు. ప్రతి సోమవారం బుధ భవన్‌ లోని హైడ్రా ఆఫీస్‌ లో ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోనున్నారు. ఈ గ్రీవెన్స్‌ సెల్‌ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లంచ్‌ బ్రేక్‌ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేయనుంది. ప్రజలు తమ ఫిర్యాదులతో పాటు సలహాలు ఇచ్చినా స్వీకరిస్తామని హైడ్రా కమిషనర్‌ తెలిపారు. ఫిర్యాదుతో పాటు పూర్తి వివరాలు అందజేయాలని సూచించారు. హైడ్రా గ్రీవెన్స్‌ సెల్‌ ఫిర్యాదులపై ఏమైనా సందేహాలు ఉంటే 040 - 29565758, 040-29560596 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News