నేను బీఆర్ఎస్ పార్టీలో ఎలా చేరాలి మేడం.. కవితకు మహారాష్ట్ర యువకుడి ట్వీట్
మహారాష్ట్రకు చెందిన సాగర్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో ఎలా చేరాలంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ట్వీట్ చేశారు. ఆ వ్యక్తికి కవిత కూడా రిప్లై ఇచ్చారు.
టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌గా మారిన తర్వాత సీఎం కేసీఆర్ పార్టీని ఇతర రాష్ట్రాల్లో విస్తరించే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలోని నాందేడ్‌లో భారీ సభను విజయవంతంగా నిర్వహించారు. రాబోయే రోజుల్లో మరిన్ని రాష్ట్రాల్లో బీఆర్ఎస్ భారీ సభలు నిర్వహించడానికి కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కేసీఆర్ 'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' పేరుతో దేశవ్యాప్త చర్చకు తెర తీశారు. అనేక మంది ఇతర రాష్ట్రాల నాయకులు బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రకు చెందిన సాగర్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో ఎలా చేరాలంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ట్వీట్ చేశారు. ఆ వ్యక్తికి కవిత కూడా రిప్లై ఇచ్చారు.
'సాగర్ గారూ, మీరు మా నాయకుడు.. గౌరవనీయులైన సీఎం కేసీఆర్ గారు నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభలు, కార్యక్రమాలకు మద్దతు ఇవ్వండి. దేశవ్యాప్తంగా మేము నిర్వహించబోయే సభలు, ర్యాలీలు, సమావేశాల్లో పాల్గొనండి. మీరు నాకు డైరెక్ట్ మెసేజ్ చేస్తే నేను వివరాలు పంపుతాను. మేం మిమ్ముల్ని ఆహ్వానించడానికి చాలా సంతోషంగా ఉన్నాము' అంటూ కవిత రిప్లై ఇచ్చారు.
మహారాష్ట్రకు చెందిన సాగర్ అనే వ్యక్తి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. అనేక మంది పార్టీ అభిమానులు సదరు వ్యక్తికి అభినందనలు తెలుపుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలోకి మిమ్ముల్ని స్వాగతిస్తున్నామని మెసేజెస్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజానీకం సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ విధానాలకు సాగర్ ఒక నిదర్శనమని అంటున్నారు. నాందేడ్‌లో నిర్వహించిన సభ మహారాష్ట్ర ప్రజలపై గణనీయమైన ప్రభావం చూపిందనడానికి సాగర్ ఒక ఉదాహరణగా చెబుతున్నారు.