హైకోర్టులో కేటీఆర్ కు రిలీఫ్
పది రోజుల వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశం
Advertisement
ఫార్ములా -ఈ రేస్ పై ఏసీబీ నమోదు చేసిన కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు ఊరట లభించింది. పది రోజుల పాటు అంటే ఈనెల 30 వరకు ఆయనను అరెస్టు చేయొద్దని ఏసీబీని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఏసీబీ తనపై దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం వారం రోజుల పాటు కేటీఆర్ ను అరెస్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement