హైదరాబాద్‌లో దంచి కొట్టిన వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలో పలు ప్రాంతల్లో ఉరుములు, మెరుపులతో కుడిన వర్షం దంచి కొడుతుంది.

Advertisement
Update:2024-10-23 19:01 IST

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలో పలు ప్రాంతల్లో ఉరుములు, మెరుపులతో కుడిన వర్షం దంచి కొడుతుంది. సికింద్రాబాద్, తార్నాక, మెట్టగూడ, ఉప్పల్, బేగంపేట, అమీర్‌పేట, పలు ప్రాంతల్లో వర్షం కురుస్తోంది. రోడ్లపై వర్షపు నీరు భారీగా నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయారు. బంగాళాఖతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజులు వర్షాలు కురవనున్నాయి.

గంటకు 30 నుంచి 40 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. సోమ, మంగళవారాల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురవనుంది. ఇటు దక్షిణ తెలంగాణ జిల్లాలైన నల్గొండ, మహబూబ్ నగర్ లలో అక్కడక్కడా తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. హైదరాబాద్ న‌గ‌రంలో గంటకు 8 – 10 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. 

Tags:    
Advertisement

Similar News