పంజాబ్‌ లో రైల్వే ట్రాక్‌ పై ఇనుప రాడ్లు

రైలు ప్రమాదానికి కుట్ర.. లోకో పైలెట్‌ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం

Advertisement
Update:2024-09-23 17:10 IST

పంజాబ్‌ లో రైల్వే ట్రాక్‌ పై ఇనుప రాడ్లు పెట్టి రైలు ప్రమాదానికి కుట్ర చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. పంజాబ్‌ లోని భటిండా - ఢిల్లీ మార్గంలో రైలు పట్టాలపై 12 ఇనుప రాడ్లను పెట్టారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు అదే ట్రాక్‌ పై వెళ్తోన్న గూడ్స్‌ రైల్‌ లోకో పైలెట్‌ ఇనుప రాడ్లను గుర్తించి సడన్‌ బ్రేక్‌ లు వేసి రైలును ఆపడంతో ప్రమాదం తప్పింది. రైల్వే ప్రొటక్షన్‌ సెల్‌ కు లోకో పైలెట్‌ సమాచారం ఇవ్వడంతో వాళ్లు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ట్రాక్‌ పై నుంచి రాడ్లను తొలగించడంతో రైళ్ల రాకపోకలు యథావిధిగా సాగాయి. గుర్తు తెలియని వ్యక్తులు రెండు నెలల్లోనే రైలు పట్టాలపై గ్యాస్‌ సిలిండర్లు, ఇనుప రాడ్లు, స్టీల్‌ దిమ్మెలు, స్తంభాలు, డిటోనేటర్ల వంటివి పెట్టి రైలు ప్రమాదాలు జరిగేలా 18 సార్లు కుట్ర చేశారు. రైల్వే సిబ్బంది అప్రమత్తతతో ఈ ప్రమాదాలను నివారించగలిగారు.

Tags:    
Advertisement

Similar News