తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి : రాజయ్య

తెలంగాణలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు

Advertisement
Update:2024-09-23 16:57 IST

తెలంగాణలో కాంగ్రెస్ పాలన గుడ్డి ఎద్దు చేనులో పడ్డట్టు ఉందని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లడారు. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య పరిస్థితి అస్తవ్యస్తంగా ,అగమ్య గోచరం గా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా వైద్య రంగంలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని రాజయ్య గుర్తు చేశారు. రాష్ట్ర ఆరోగ్య పరిస్థితులపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ముగ్గురు సభ్యులతో ప్రభుత్వ ఆస్పత్రుల అధ్యయనానికి కమీటీని ఏర్పాటు చేశారు. ఇవాళ గాంధీ ఆస్పత్రికి వెళ్లిన రాజయ్యతోపాటు ఇతర నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దవాఖానకి మేము వెళితే తప్పేమిటి ?ఎందుకు పోలీసులు అడ్డుకున్నారని మాజీ డిప్యూటీ సీఎం ప్రశ్నించారు.కేసీఆర్ హయంలో హెలీకాఫ్టర్లలో ఏజెన్సీ ప్రాంతాలకు వైద్య సామగ్రి తరలించామని పేర్కొన్నారు.

రేవంత్ పాలనలో మంత్రులు హెలికాఫ్టర్లను ఎడ్ల బండ్లలా తమ సొంత అవసరాలకు వాడుకుంటున్నారు ..ప్రజారోగ్యం గురించి మాత్రం పట్టించుకోవడం లేదని రాజయ్య తెలిపారు. రాష్ట్రంలో ప్రజా పాలనా ?ఎమర్జెన్సీ పాలనా ? నడుస్తుందని ప్రశ్నించారు. తెలంగాణలో మాతా శిశుమరణాలు ,విష జ్వరాలు రాష్ట్రంలో పెరిగిపోతున్నాయి..రాష్ట్రంలో పగలు ఈగలు ,రాత్రి దోమలతో ప్రజలకు సహవాసం తప్పడం లేదన్నారు. దేని పైనా సమీక్ష లేకపోవడం తో ప్రజారోగ్యం కుంటుపడిందన్నారు. తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇపుడు కేసీఆర్ కిట్ లేదు ..న్యూట్రిషన్ కిట్ లేదన్నారు. గాంధీ ఆస్పత్రిలో శిశు మరణాలు పెరిగాయి ఎందుకు జరిగాయో తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళామని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ నిలదీశారు. ప్రజారోగ్యాన్ని ప్రభుత్వం పట్టించుకునే దాకా మేము పోరాటాన్ని ఆపామని ఎమ్మెల్యే సంజయ్ తెలిపారు.

Advertisement

Similar News