కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్..ఆ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు

పార్టీ మారిన 10 మంది ఎమ్మెలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇవాళ కోర్టు విచారించింది.

Advertisement
Update:2024-09-23 15:36 IST

బీఆర్‌ఎస్ పార్టీ ఫిరాయించిన 10 మంది శాసన సభ్యులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇవాళ కోర్టు విచారించింది. పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఒక పార్టీ గుర్తు నుండి గెలిచి మరో పార్టీలోకి మారడం రాజ్యాంగ విరుద్దమని తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పాల్ పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి కారు గుర్తుపై గెలుపొందిన దానం నాగేందర్ ఆరు నెలల కాక ముందే హస్తం గుర్తు నుంచి లోక్ సభకు పోటీ చేశారని పిటిషన్‌లో తెలిపారు. రాజీనామా చేయకుండా వేరే పార్టీలో చేరి అధికారాలను అనుభవించడం తప్పని ప్రస్తావించారు. ఇది చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందని పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేసేలా అసెంబ్లీ స్పీకర్‌ను కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్‌లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో బీఆర్‌ఎస్ కోరింది.

Tags:    
Advertisement

Similar News