సంక్రాంతికి వచ్చిండ్రు!

చీటికి మాటికి మీ పోలీసులను మా అపార్ట్మెంట్ కు పంపించడం మానేయండని ఆర్‌ఎస్‌పీ ట్విటర్‌లో పోస్ట్‌

Advertisement
Update:2025-01-14 14:53 IST

మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గచ్చిబౌలి, కోకాపేటలోని వారి నివాసాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి అరెస్టు నేపథ్యంలో ఆందోళనలు జరగకుండా పోలీసులు ఈమేరకు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. అయితే దీనిపై బీఆర్‌ఎస్‌ సీనియన్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ట్విటర్‌లో ఓ పోస్టు పెట్టారు. ఆయన నివాసం ఉంటున్న అపార్ట్‌ మెంట్‌ ముందు పోలీసులను పెట్టడంపై ఫైర్‌ అయ్యారు.

రేవంత్ రెడ్డి సర్కార్ఇం త పొద్దున్నే అదీ పండగ పూట మా అపార్ట్మెంట్ ముందు మళ్లీ పోలీసులను మొహరించింది. ఎందుకు వచ్చిండ్రు అంటే పాడి కౌశిక్ రెడ్డి కోసం మేమేమైనా పోరాటం చేస్తమని మా పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఉంది అని అంటున్నరు. అవును బరాబర్ చేస్తం కూడా. అది మా బాధ్యత .కానీ కాంగ్రెస్ గూండాల లాగా విధ్వంసం చేసే సంస్కృతి మాకు లేదు. సీయం గారూ,ఇప్పటికి మీరు ఎన్నో సార్లు నన్ను గృహనిర్బంధంలో ఉంచిండ్రు. నాకు హైదరాబాదు నగరంలో సొంత ఇల్లు కూడా లేదు…అద్దెకు ఒక చిన్న అపార్ట్మెంట్ లో ఉంటున్న. ప్రతి సారి మా ఇంటికి పోలీసులు వచ్చి హడావిడి చేయడం వల్ల ఈ కాంప్లెక్స్ లో మిగతా కుటుంబాలు చాలా ఆందోళనకు, తీవ్ర అసౌకర్యానికి గురైతున్నరు. వాళ్లు నా పై సానుభూతిని చూపిస్తున్నారు, మీ పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నరు.

మేము పీడిత ప్రజల పక్షాన చివరి శ్వాస వరకు వారి గొంతుకగానే పోరాడుతూనే ఉంటాం. మేం మారం. మీరు మారుతరన్న నమ్మకం కూడా మాకు లేదు. ఈ యుద్ధానికి విరామం లేదు.మిగతా అపార్ట్మెంట్ వాసుల స్వేచ్ఛ, జీవించే హక్కులను దృష్టిలో ఉంచుకుని నాకు మీ ప్రభుత్వమే ఒక ఇంటిని కేటాయించి కిరాయి మీరే కట్టుకోండి లేదా చీటికి మాటికి మీ పోలీసులను మా అపార్ట్మెంట్ కు పంపించడం మానేయండి అని రాసుకొచ్చారు. 

Tags:    
Advertisement

Similar News