ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్ మార్పుకోసం రైతుల ఆందోళన
యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్ మార్పు కోసం కలెక్టరేట్ భవనం ముందు మహా ధర్నా నిర్వహించడానికి బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. ఈ ధర్నాలో మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. అయితే ధర్నాకు అనుమతి లేదని భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. ధర్నా కోసం ఏర్పాటు చేసిన టెంట్లను, కుర్చీలను తొలిగించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా ఎవరూ ర్యాలీలు, ధర్నాలు చేపట్టవదని డీసీపీ సూచించారు. మరోవైపు యాదాద్రి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. బారికేడ్లు దాటుకుని రైతులు కలెక్టరేట్‌లోకి వెళ్లడానికి యత్నిస్తున్నారు. అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నది.ఆర్ ఆర్ ఆర్ బాధిత రైతులు, బీఆర్‌ఎస్ నేతలు రాస్తారోకోకు దిగారు. రాస్తారోకోతో హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.