సెక్రటేరియట్‌లో అమల్లోకి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్
సెక్రటేరియట్‌లో పనిచేసే అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి వర్తింపు
Advertisement
ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంచడం, అవకతవకలు తగ్గించడమే లక్ష్యంగా సచివాలయంలో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సచివాలయంలో పనిచేసే అన్నిశాఖ అధికారులు, సిబ్బంది ఇక నుంచి ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. సచివాలయంలో వివిధ శాఖల హెచ్‌వోడీల నుంచి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వరకు అందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది. టెక్నికల్ సమస్యల వల్ల నేడు రేపు ఫిజికల్ అటెండెన్స్ ను కూడా అనుమతిస్తామని ప్రభుత్వం తెలిపింది. సెక్రటేరియట్‌లో 34 ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు పనిచేస్తున్నారు. మొత్తం 60పైగా ఫేషియల్ రికగ్నిషన్ మిషన్లను ఏర్పాటు చేశారు.
Advertisement